Monday, April 29, 2024

యువత డ్రగ్స్‌కు బానిస కావద్దు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం పురస్కరించుకుని డ్రగ్స్‌కు యువత బానిస కావద్దు.. బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోద్దని జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ అన్నారు. డ్రగ్స్ వాడకం సంతోషంతో మొదలై దుఃఖంతోనే అంతమౌతుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టి పెట్టాలని ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గ నిర్దేశం చేయాలని సూచించారు.

డ్రగ్‌కు అలవాటు పడిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదని భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వా రవుతారని అన్నారు. మొదడు, నరాల వ్యవస్థ శాశ్వత మానసిక వైకల్యం వచ్చే అవకాశాలు ఉంటాయని అన్నారు. మాదకద్రవ్యా లు అమ్మడం, సేవించడం రెండు నేరమని అన్నారు.

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్ట్రాన్స్ యాక్టు 1985 ప్రకారం శిక్షా ర్హులు అవతారని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తర్వాత బాధపడి లాభం లేదని అన్నారు. గడిచిన 2022 సంవత్సరం జిల్లాలో గంజాయికి సంబంధించిన మొత్తం 11 కేసులు నమోదయ్యాయని, ఇందులో 32 మందిని అరెస్టు చేయడంతో పాటు 17.620 కెజిల గంజాయిని, 11 గంజాయి మొక్కలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

2023 సంవత్సరంలో జిల్లాలో గంజాయికి సంబంధించి మొత్తం 05 కేసులు నమోదయ్యాయని, ఇందులో 13 మందిని అరెస్టు చేయడంతో పాటు 71.238 కెజిల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News