Monday, April 29, 2024

డాక్టర్ పి.వి. చలపతిరావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -
DR PV Chalapathi Rao Passed Away
బి.సి.రాయ్ జాతీయ అవార్డు గ్రహీత

హైదరాబాద్: ప్రముఖ సర్జన్, డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డు గ్రహీత, డాక్టర్ పివిసి రావుగా పేరు గాంచిన డాక్టర్ పి.వి.చలపతిరావు(92) ఆదివారం కన్నుమూశారు. 1994లో తెలుగు మాట్లాడే రాష్ట్రాల నుంచి అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఎఎస్‌ఐ)కు అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తి పివిసి రావు. ఈయన కుమారుడు డాక్టర్ పి.రఘురామ్ ప్రముఖ ఆంకాలజిస్టు. ప్రస్తుతం ఎఎస్‌ఐ అధ్య క్షుడి గా ఉన్నారు. సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ చలపతిరావు 1983లో పదవీ విరమణ పొందారు. ఉస్మానియా మెడికల్ కాలేజి సర్జరీ విభాగాధిప తిగా పనిచేశారు. తరువాత అభ(సౌదీ అరేబియా)లో చీఫ్ సర్జన్‌గా పనిచేశారు. 1991 నుంచి 2002 మధ్య ఒక దశాబ్దం పాటు దుర్గాభాయ్ దేశ్ ముఖ్ హాస్పిటల్ చైర్మన్‌గా పనిచేశారు. 2004 నుండి కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) ఆసుపత్రిలో వైద్య విద్య డైరెక్టర్‌గా కూడా పని చేశారు. డాక్టర్ చలపతిరావుకు భార్య డాక్టర్ ఉషలక్ష్మి, కుమారుడు డాక్టర్ రఘురామ్, కోడలు డాక్టర్ వైజయంతి, మనవడు సాయిరాం ఉన్నారు.

DR PV Chalapathi Rao Passed Away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News