Monday, April 29, 2024

మార్కెట్లోకి రెడ్డీస్ ల్యాబ్ 2-డిజి

- Advertisement -
- Advertisement -

Dr. Reddy’s Labs announces commercial launch of 2-DG

ప్రతి సాచెట్ గరిష్ఠ ధర రూ. 990

న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్స కోసం ఉపయోగించనున్న 2-డియోక్సీ-డి-గ్లూకోస్(2-డిజి) డ్రగ్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సోమవారం ప్రకటించింది. ప్రతి 2-డి.జి సాచెట్ గరిష్ఠ రిటెయిల్ ధర రూ. 990గా నిర్ణయించినట్లు రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ మందును సరఫచా చేస్తామని కంపెనీ తెలిపింది. ప్రారంభ వారాలలో ఈ మందును అన్ని మెట్రో నగరాలు, టైర్ 1 నగరాలలోని ఆసుపత్రులలో అందుబాటులో ఉంచుతామని, ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని సంస్థ వివరించింది. ఈ మందు ప్రభుత్వ సంస్థలకు గరిష్ఠ రిటెయిల్ ధరలో కొంత సబ్సిడీ ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. డిఆర్‌డిఓ భాగస్వామ్యంతో 2-డిజిని సంస్థ రూపొందించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకే వారి పర్యవేక్షణలోనే ఈ మందును ఉపయోగించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News