Saturday, April 27, 2024

బోగస్ పించన్లకు కత్తెర

- Advertisement -
- Advertisement -

Removal of Bogus Pensions in Hyderabad

 

గ్రేటర్ పరిధిలో 1.20 లక్షలు ఉన్నట్లు గుర్తింపు
నెలాఖరులోగా తొలగించేందుకు అధికారులు కసరత్తు
మృతి చెందిన వారి సొమ్మును దర్జాగా డ్రా చేస్తున్న కుటుంబసభ్యులు
నోటీసులు జారీచేసి బ్యాంకుల్లో జమ కాకుండా చర్యలు

మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో ఆసరా పించన్లలో అక్రమాలు ఉన్నట్లు గతంలో గుర్తించి అధికారులను వాటిని ఈనెలాఖరు వరకు తొలగించి ప్రభుత్వ ఖజానా పక్కదారి పట్టకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎక్కువగా వృద్దులకు సంబంధించిన పించన్ల విషయంలో సొమ్ము అక్రమార్కుల చేతికి వెళ్లుతుందని గుర్తించిన అధికారులు త్వరలో వారికి నోటీసులు జారీ తొలగించనున్నట్లు పేర్కొంటున్నారు. కొంతమంది మృతిచెందిన వృద్దుల నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుండటంతో కుటుంబసభ్యులు గుట్టుచప్పుడుగా ఏటిఎం ద్వారా డ్రా చేసుకుంటూ చనిపోయినట్లు మరణదృవీకరణ పత్రాలు సమర్పించకుండా ప్రభుత్వం సొమ్ముకు గండికొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరు నెలల క్రితం పించన్లపై ప్రత్యేక టాస్క్‌పోర్సు బృందాలు మండలాల వారీగా పరిశీలన చేయగా ఉన్నవాటిలో 25శాతం బోగస్ ఉన్నట్లు తేల్చారు.

గ్రేటర్ పరిధిలో జీహెచ్‌ఎంసీ గణాంకాల ప్రకారం నెలకు 6500 మంది మృతి చెందుతున్నారు. అందులో 80శాతం మంది వృద్ధులు చనిపోతున్నారు.వాటిలో సగానికిపైగా వృద్దాప్య పించన్లు తీసుకుంటున్నవారు ఉన్నారు. ఐదేళ్లలో సగటున 4 లక్షలమంది మంది చనిపోగా, వృద్దులు 3లక్షలమంది ఉంటారని, వీరిలో 1.50 లక్షల మంది పించన్లు తీసుకునే లబ్దిదారులు ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల కాలంలో మృతిచెందిన వారిలో 53వేలమంది వివరాలు సమర్పించడంతో నిలిచిపోయాయి. గతేడాది జూలై నెల నుంచి పేదలకు అందజేసే పించన్ల నగదు రెండింతలు పెరగడంతో బోగసుల పనిపట్టేందుకు అధికారులు నడుంబిగించారు. నెల వారీగా వృద్దులు,వితంతువులు, ఒంటరి మహిళలకు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 చొప్పన అందజేస్తుంది.

బోగస్ పించన్ల దార్ల నెలకు రూ. 2 కోట్లవరకు పక్కదారి పట్టవచ్చని భావిస్తూ త్వరగా వాటిని తొలగించేందుకు సంబంధిత కుటుంబసభ్యులకు నోటీసులు జారీచేసి బ్యాంకులో జమకాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఆసరా ఫించన్లు 4,80లక్షల మంది ఉండగా, హైదరాబాద్ 1,96,198, రంగారెడ్డి 1,74,498,మేడ్చల్ 1,09,881 ఉన్నట్లు ఇందులో వృద్దాప్య ఫించన్లతో పాటు వితంతువుల పించన్ల కూడా కొన్ని బోగస్ ఉన్నట్లు ప్రత్యేక పరిశీలకులు వివరిస్తున్నారు.

గడిచిన ఏడాదిలో బండ్లగూడ మండల బోగస్ ఫించన్లు బాగోతం బయటబయలు కావడంతో అధికారులు బహదూర్‌పురా, చార్మినార్, ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, ఆసిఫ్‌నగర్, షేక్‌పేట మండలాల్లో ఇంటింటి సర్వే చేసి ఆదార్ కార్డుగా పరిశీలన చేపట్టగా మండలానికి సుమారు 2400లకుపైగా బోగస్ ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అధికారుల వెంటనే వారికి నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటివరకు గుర్తించి వాటిని తొలగించడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పించన్‌దారులకు నగదు పెరుగుతుండటంతో నెలకు రెండింతల భారం పెరగడంతో బోగస్ పించన్లు తొలగించి , ఆరునెలలుగా కొత్త దరఖాస్తులు చేసిన వారిని వివరాలు పరిశీలించి అర్హులైన వారి జాబితాను సిద్దం చేస్తున్నట్లు స్దానిక రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News