Sunday, April 28, 2024

విస్తరిస్తున్న వింతవ్యాధి..

- Advertisement -
- Advertisement -

విస్తరిస్తున్న వింతవ్యాధి
ఏలూరు టు గుంటూరు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు అంతు చిక్కని వింత వ్యాధి క్రమంగా గుంటూరు జిల్లాకు విస్తరించింది. ఈక్రమంలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో వింతవ్యాధి కారణంగా పలువురు స్పృహ తప్పి పడిపోతున్నారు. నడికుడి గ్రామానికి చెందిన పల్లపు రామకృష్ణ స్పృహ తప్పి పడిపోవడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజుల క్రితం కూడా ఈ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు స్పృహతప్పి పడిపోయా రు. సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీ కాలుష్యం వల్లనే ఇలా జరుగుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి వేళ కెమికల్ ప్యాక్టరీ నుంచి వ్యర్థాలు విడుదలువుతుండటంతో స్పృహ కోల్పోతున్నారని వివరిస్తున్నారు. నడికుడిలో మొత్తం 7 కేమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి,ఈ ఫ్యాక్టరీస్ లో మెడిసిన్స్ లో వాడే ముడి సరుకు తయారీ అవుతోందని అర్థరాత్రి సమయంలో ఫ్యాక్టరీల నుండి విపరీతమైన దుర్గంధం వస్తుండటంతో పక్కనే ఉన్న కాలనీ వాసులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఇదిఇలా ఉండగా ఆదివారం అస్వస్థతకు గురైన రామ క్రిష్ణ గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో రామకృష్ణను శనివారం సాయంత్రం స్థానిక హాస్పిటల్ కి తరలించగా ఆదివారం ఉదయం అతనికి ఫిట్స్ రావడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. కెమికల్ ఫ్యాక్టరీల మూలంగానే రామక్రిష్ణ అస్వస్థతకు గురయ్యారు అని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కేమికల్ ఫ్యాక్టరీల విషవాయువుల నుండి అస్వస్థతకు గురయ్యాడా..?, లేక జ్వరంతో ఫిట్స్ వచ్చి పడిపోయాడా అనే విషయాలపై వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం అస్వస్థతకు గురైన రామక్రిష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యవర్గాలు వివరిస్తున్నాయి. ఏలూరు, నెల్లూరు ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో స్థానికులు స్పృహతప్పి పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రసాయన పరిశ్రమ నుంచి వ్యర్థాలను విడుదల చేయటం వల్లే ఇలా జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా నెల్లూరులో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పరామర్శించారు. వారిలో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కార్మికులను సరైన వైద్య సేవలందించాలని వైద్యులకు ఆదేశాలిచ్చారు. పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన 49మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, వారందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు మంత్రికి వివరించారు. భారీ వర్షాల కారణంగా తాగునీటిలో ఏదైనా కెమికల్ కలిసిందేమోనన్న అనుమానం కారణంగా తాగునీటిని పరీక్షలకు పంపామని, ఫలితాలు వచ్చిన అనంతరం అసలు కారణం తెలిసే అవకాశం ఉందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.

Eluru Mysterious Disease spread to Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News