Monday, May 6, 2024

జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతి

- Advertisement -
- Advertisement -

Emergency approval for Johnson & Johnson vaccine

న్యూఢిల్లీ : కరోనా కట్టడికి ఒకే డోసు టీకాను తీసుకొచ్చిన అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్, భారత్‌లో అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. ఈ టీకాకు అత్యవసర అనుమతులు మంజూరు చేసినట్టు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా మహమ్మారిపై మనదేశం సాగిస్తున్న సమష్టి పోరాటానికి ఇది మరింత దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. దీంతో భారత్‌లో అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందిన టీకాల సంఖ్య ఐదుకు చేరింది. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ తమ టీకా అత్యవసర వినియోగం కోసం శుక్రవారం దరఖాస్తు చేయగా, అదే రోజు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి పొందగలిగిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి , టీకాలు అందుబాటులో ఉండగా, అమెరికాకు చెందిన మోడెర్నా టీకాకు కూడా ఇటీవల కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మోడెర్నా టీకాలను దిగుమతి చేసుకునేందుకు దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం స్పుత్నిక్ ప్రైవేటు లోనే ఎక్కువగా అందుబాటులో ఉంది. ఈ జాబితా లోకి ఇప్పుడు జాన్సన్ టీకా చేరింది. అయితే మిగతావన్నీ రెండు డోసుల టీకాలు కాగా, జాన్సన్ మాత్రం సింగిల్ డోసు టీకా కావడం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఈ టీకాను ఉత్పత్తి చేయనున్నది. ఈ సింగిల్ డోసు టీకాతో కరోనా వైరస్‌ను 85 శాతం సమర్ధంగా నిర్మూలించే అవకాశాలు ఉన్నాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌తో జాన్సన్ టీకా సామర్ధం తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తరువాత ఆ టీకా ప్రభావం అధికంగా ఉన్నట్టు గుర్తించారు. భారత్‌కు అమెరికా మరిన్ని టీకా డోసులు అందించాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News