Sunday, April 28, 2024

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

- Advertisement -
- Advertisement -

ధర్మారం: ప్రతి బీఆర్‌ఎస్ యువజన కార్యకర్త సైనికుల్లా పని చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మండల బీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మంద శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీకి యువజన విభాగం కార్యకర్తలు మూల స్థంబాలని, పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తల సేవలు అద్భుతమన్నారు. పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు పార్టీ కార్యక్రమాలను నడిపించడంలో ప్రధాన పోత్ర పోషిస్తున్నారని, వచ్చే ఎన్నికలకు సంసిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చి గడిచిన 9 ఏళ్ల పాలనలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని గడపగడపకు వివరించాలన్నారు. ప్రతిపక్షాలకు సరైన గుణపాఠం ప్రజల నుండి ఇప్పించేలా కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మూడో సారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, జిల్లా సహకార సంఘాల చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మండల బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మిట్ట తిరుపతి, సీనియర్ నాయకులు ఆఖరి సత్యం, బండవరం సుమన్, యువజన విభాగం కార్యదర్శి దేవి రాజేందర్, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు దేవి వంశీతోపాటు మల్లాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు, యువజన కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News