Monday, April 29, 2024

పోలీస్ అభ్యర్థులకు రాచకొండలో పరీక్ష

- Advertisement -
- Advertisement -

Examination in Rachakonda for police candidates

పరిశీలించిన సిపి మహేష్ భవత్

హైదరాబాద్: పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులకు రాచకొండ పోలీసులు ఆదివారం క్వాలిఫై పరీక్ష నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని శ్రీచైతన్య హైస్కూల్, నాచారం, అవినాష్ కాలేజీ ఎల్‌బి నగర్, శ్రీఇందు ఇంజనీరింగ్ కాలేజీ ఇబ్రహింపట్నంలో పోలీస్ పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాసేందుకు 6,000 మంది అభ్యర్థులు వచ్చారు. రానున్న పోలీస్ ఉద్యోగాల ప్రకటనలో పెద్ద ఎత్తున ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్నారు. దీనికి పోటీ పడే అభ్యర్థులకు రాచకొండ పోలీసులు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. కోచింగ్‌కు ఎంపిక చేసేందుకు ముందుగా అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సందర్శించారు. రాచకొండ పోలీసులు అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సిపి తెలిపారు. యువకులు ఉచిత శిక్షణను ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిసిపిలు,ఎడిసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News