Sunday, April 28, 2024

లైన్‌మెన్ నిర్లక్ష్యం.. విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

మంగపేట: విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండలంలోని కమలాపురం గ్రామంలో సినిమాహాల్ వీధిలో నివాసం ఉంటున్న దిడ్డి సాంబయ్య(63) వ్యవసాయం చేసుకుంటు జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని హనుమాన్ గుడి సమీపంలోని తన వరి పోలాన్ని చూసుకునేందుకు తన పక్కపొలం యజమాని ఇండ్ల కాంతయ్యతో కలిసి పొలానికి వెళ్ళాడు. పొలంలో నీళ్ళులేక ఎండిపోతుందని బోరు వేయగా విద్యుత్ రావడంలేదని సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఫ్యూజ్ కొట్టి వేసి ఉండడంతో ఫ్యూజ్ వేసేందుకు అక్కడే ఉన్న ఏబీ స్వీచ్( ట్రాన్స్ ఫార్మర్‌కు, 11కేవీ విద్యుత్ లైన్‌కు ఉన్నకనెక్షన్)ను బంద్‌చేసి పైకి ఎక్కి ఫ్యూజ్ వేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి కిందపడి మృతి చెందాడు.

ఇదిలా ఉండగా ఏబీ స్వీచ్‌లోని ఒకటి గత ఆరు నెలలుగా పని చేయడం లేదని విద్యుత్ సిబ్బంది దానిని డైరెక్ట్ వైర్‌తో కనెక్షన్ ఇచ్చి వదిలి వేశారు. దానిని చూసుకోని రైతు స్విచ్ వేసేందుకు ప్రయత్నించగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని  స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటుగా మరి కొన్ని ట్రాన్స్‌ఫార్మర్‌లకు సైతం ఇలానే వైర్లు చుట్టి వదిలి వేశారని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై లైన్‌మెన్ ప్రభాకర్‌ను వివరణ కోరగా గత వేసవి కాలంలో ఏబీ స్విచ్‌లోని ఒక దానికి మేల్ ఫిమేల్ పని చేయడం లేదని అందుకు దానికి వైరు చుట్టామని దీంతో పాటుగా గత వేసవి కాలంలో కొంత మంది దొంగలు ఏబీ స్విచ్ బంద్‌చేసి ట్రాన్స్ ఫార్మర్‌ను పగులగోట్టి వైరును ఎత్తుకుని పోయారని భయం ఉంటుందనే వైరును చుట్టామని సాంబయ్య చూసుకోకుండా ఇలా చేశారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News