Monday, April 29, 2024

చైనాలో అగ్నిప్రమాదం: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Fire accident in China:8 killed

 

బీజింగ్: చైనాలోని దాలియన్ నగరంలో శనివారం ఒక నివాస భవనంలో ఎల్‌పిజి సిలిండర్ లీకేజ్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. నగరంలోని పులందియన్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరకుని మంటలను ఆర్పివేశాయి. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది మరణించినట్లు అధికార వార్తా సంస్థ సిన్హువా తెలిపింది. అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని నివాసులను ఖాళీ చేయించి వేరే చోటుకు తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News