Monday, April 29, 2024

ఫుట్‌బాల్ హీరో డీగో మరడోనా ఇకలేరు

- Advertisement -
- Advertisement -

Football legend Maradona passes away

 

బ్యూనస్‌ఎయిర్స్: అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా (60) బుధవారం గుండె పోటుతో మరణించారు. ప్రపంచ ఫుట్‌బాల్‌లోని దిగ్గజాల్లో ఒకడిగా మారడోనా పేరు తెచ్చుకున్నారు. 1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్ ట్రోఫీని అందించిన ఘనత మారడోనాకు ఉంది. ఫుట్‌బాల్ మాంత్రికుడిగా పేరున్న మారడోనాకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుత గోల్స్ సాధించే ఆటగాడిగా మారడోనా ప్రసిద్ది గాంచారు. ప్రపంచ సాకర్‌లో అర్జెంటీనాను బలమైన జట్టుగా తీర్చిదిద్దడ ంలో మారడోనా ముఖ్య భూమిక పోషించారు. భారత్‌లోనూ ఫుట్‌బాల్ అభివృద్ధికి మారడోనా తనవంతు సహకారం అందించారు.

ఫుట్‌బాలే స ప్రాణంగా ఆయన జీవించారు. కోచ్‌గా, కెప్టెన్‌గా, ఆటగాడిగా ఫుట్‌బాల్ క్రీడపై తనదైన ముద్ర వేశారు. మారడోనా మరణించారనే వార్త తెలియగానే ఆయన అభిమానులు కన్నీళ్ల పర్యంతరం అయ్యారు. బ్రెజిల్ దిగ్గజం పీలే తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించిన సాకర్ ఆటగాడిగా మారడోనా నిలిచారు. అర్జెంటీనాను సాకర్‌లో విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. దాదాపు రెండు దశాబ్దాల అర్జెంటీనా జట్టులో అగ్రశ్రేణి ఆటగాడిగా కొనసాగారు. ఆయన సారధ్యంలో అర్జెంటీనా ఎన్నో చారిత్రక విజయాలను సొంతం చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News