Monday, April 29, 2024

మరింత రుణ ఊరట హానికరం

- Advertisement -
- Advertisement -

Further extension of loan moratorium period may affect Economy system

 

మారటోరియంపై సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడి

ముంబై : రుణ మారటోరియం (తాత్కాలికంగా ఇఎంఐల వాయిదా) విషయంలో మరిన్ని ఊరట చర్యలు ఆర్థిక వ్యవస్థకు హానికరం అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్థిక విధానంలో కోర్టు జోక్యం సరికాదని, వివిధ రంగాలకు భారీ ఊరటనివ్వడం సాధ్యం కాదని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తిగత, చిన్న మధ్యతరహా పరిశ్రమల రుణగ్రస్తులకు రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీపై వడ్డీని ఆర్‌బిఐ మాఫీ చేసింది. అయితే ఇంతకుమించి ఇంకా చర్యలు భారత ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ వ్యవస్థకు హానికరమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. రుణ వడ్డీపై వడ్డీని మాఫీ చేసే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ స్పందన ఇచ్చింది. ఇప్పటికే ఆర్థిక ప్యాకేజీల ద్వారా ఊరట చర్యలు తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఆ ప్యాకేజీకి ఎక్కువ తగ్గింపులను జోడించడం సాధ్యం కాదు. రూ .3 లక్షల కోట్ల ఎంఎస్‌ఎంఇ ఎమర్జెన్సీ క్రెడిట్ పాలసీని ఇప్పటికే ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది. వడ్డీని మాఫీపై కేబినెట్ ఆమోదించిన తర్వాత జారీ చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సర్క్యులర్ తేదీ నుండి ఒక నెలలోపు బ్యాంకులు కాంపౌండ్ వడ్డీ మినహాయింపు పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుందని అఫిడవిట్‌లో పేర్కొంది. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, ఆర్‌బిఐ నిర్ణయాలు తీసుకున్నాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఈ కేసును అక్టోబర్ 13 న కోర్టు విచారించనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News