Sunday, April 28, 2024

గద్వాలకు సిఎం కెసిఆర్ వచ్చే అర్హత లేదు

- Advertisement -
- Advertisement -

గద్వాల: ఎన్నికల సమయంలో గద్వాల జిల్లాకు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిన సిఎం కెసిఆర్, ఇచ్చిన హమీలను అమలుచేసి గద్వాలకు రావాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా ఎస్పి కార్యాలయ ప్రారంభోత్సవానికి సిఎం కెసిఆర్ వస్తున్నారని, గతంలో జిల్లాకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేని సిఎం కెసిఆర్ నేడు గద్వాలకు వచ్చే అర్హత లేదని అన్నారు.

ఎన్నికల సమయంలో భావితరాలు, రాజకీయాలను అసహించుకునే దౌర్భాగ్యస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో దాపురించిందని, తెలంగాణ ఆకాంక్షతో ఎగసిపడిన ఆవేశాన్ని ఆసరగా చేసుకొని ప్రజలు మనోభావాలతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. 2014, 2018 ఎన్నికల సమయంలో నడిగడ్డకు ఇచ్చిన హామీలను ప్రకటనలకే పరిమతమైనవని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆర్డీయస్ దగ్గర కుర్చివేసుకొని కూర్చొని పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరు అందిస్తానని చెప్పి ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.

జూరాల వద్ద పార్కు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడు ఎకరాలు, గద్వాలలో మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, చేనేత హ్యాండ్‌లూమ్ పార్కు, అలంపూర్‌లో ఆర్టీసీ డిపో, అనేక హామీలను ఇచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. నడిగడ్డలో రహదారుల సౌకర్యం అధ్వానంగా ఉందని, రోడ్లు మరమ్మతులు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.హామీలను నెరవేరిస్తనే గద్వాల జిల్లాకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణాధ్యక్షుడు బండల వెంకట్రాములు, మున్సిపల్ ప్లోర్‌లీడర్ కుమ్మరి శ్రీను, కౌన్సిలర్ త్యాగరాజు, నాయకులు నాగేందర్‌యాదవ్, రాజశేఖర్‌రెడ్డి, గీతారెడ్డి, మోహన్‌రెడ్డి, గణేష్, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News