Sunday, April 28, 2024

మూడు కథల సమాహారం

- Advertisement -
- Advertisement -

Gamanam Cinema trailor released by Pawan kalyan

 

సుజనా రావు దర్శకురాలిగా పరిచయమవుతున్న ‘గమనం’ చిత్రం రియల్ లైఫ్ డ్రామాగా రూపొందుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం ట్రైలర్ చూశాను. ట్రైలర్ సుజనాత్మకంగా, ఆకట్టుకునేలా ఉంది. సుజనారావు సున్నితమైన అంశాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అందరూ ఈ చిత్రాన్ని చూడాలని కోరుతున్నాను’అని అన్నారు. ఇక ‘గమనం’ అనేది మూడు కథల సమాహారం అని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. ఒక కథ శ్రియా శరణ్ పోషించిన దిగువ మధ్యతరగతి గృహిణి పాత్ర ప్రధానంగా నడిస్తే, మరో కథ శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ మధ్య ప్రేమ చుట్టూ సాగుతుంది. ఇంకో కథలో తామెప్పుడు పుట్టారో కూడా తెలియని అనాథ బాలలు తమ బర్త్‌డే జరుపుకోవాలని కనే కలను చూడవచ్చు. వీరి విభిన్నమైన భావోద్వేగాలు ఎలా ఉంటాయని తెలుసుకోవాలంటే ‘గమనం’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News