Monday, April 29, 2024

మ్యాచ్ రీషెడ్యూల్ చేసే ఆలోచనలో బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

మ్యాచ్ రీషెడ్యూల్ చేసే ఆలోచనలో బిసిసిఐ
 ఈ నెల 22న ఇంగ్లాండ్‌కు గంగూలీ?

Ganguly to meet ECB Over Ind vs Eng 5th Test

న్యూఢిల్లీ: కరోనా కేసుల కారణంగా ఇంగ్లాండ్‌తో శుక్రవారం ప్రారంభంకావాల్సిన ఐదో టెస్టు రద్దవ్వడం అందర్నీ నిరాశకు గురిచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ను నిలిపివేసినా భవిష్యత్‌లో తిరిగి నిర్వహించడానికి బిసిసిఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసిబి)తోనూ సంప్రదింపులు జరుపుతోంది. అయితే, ఇదే విషయంపై ఈసిబి ప్రతినిధులతో మాట్లాడేందుకు బిసిసిఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ త్వరలో ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడని తెలిసింది. ఐదో టెస్టు రద్దు కావడం వల్ల ఇరు జట్లకూ పెద్దమొత్తంలో నష్టం కలిగే అవకాశం ఉండటంతో ఎలాగైనా రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐ చూస్తోంది. సెప్టెంబర్ 22న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం.
ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం సాయంత్రం భారత బృందంలోని సహాయక సిబ్బందిలో యోగేశ్ పార్మర్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

అయితే, అతడితో పలువురు ఆటగాళ్లు ప్రైమరీ కాంటాక్ట్‌లుగా ఉన్నారని తెలిసింది. తర్వాత ఆటగాళ్లందరికీ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలింది. అయినా టీమిండియా ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్టులో ఆడలేమని బిసిసిఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇరు బోర్డుల పెద్దలు చర్చించి మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే ఎలాగైనా ఈ మ్యాచ్‌ను తిరిగి నిర్వహించాలని బిసిసిఐ భావిస్తోంది. మరోవైపు ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సిరీస్ ఫలితం కూడా తేలాల్సి ఉంది. ఇక ఓవల్ వేదికగా నాలుగో టెస్టుకు ముందు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌కు పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.

Ganguly to meet ECB Over Ind vs Eng 5th Test

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News