Monday, April 29, 2024

ఎఐతో కొలువులకు ఎసరే!

- Advertisement -
- Advertisement -

మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం ఇదే
జీనియస్ కన్సల్టెంట్స్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్).. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిగురించే చర్చ నడుస్తోంది. దీని రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని కొందరు నిపుణులు అంటుంటే.. మరి కొందరు మాత్రం ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ ఉండదని విశ్లేషిస్తున్నారు. అయితే మెజారిటీ ఉద్యోగుల్లో మాత్రం ఎఐ పట్ల భయాందోళనలు ఉన్నాయి. ఇది ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే భయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. జీనియస్ కన్సల్టెంట్స్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలోఈ విషయం వెల్లడయింది. ముఖ్యంగా కంటెంట్ క్రియేషన్, కోడింగ్, డిజైనింగ్ రంగాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ సర్వే ద్వారా వెల్లడయింది.

Also Read: జలపాతంలో పడిపోయిన కారు(షాకింగ్ వీడియో)

ఈ ఏడాది మే 15నుంచి జులై 24 మధ్య భిన్న సంస్థల్లో పని చేస్తున్న 1,207 మంది ఉద్యోగులపై జీనియస్ కన్సల్టెంట్స్ ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఆధారంగా ఓ నివేదికను రూపొందించింది. అందులో ఉద్యోగాలతో పాటుగా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 50 శాతం మంది చాట్‌జిపిటి, ఎఐ ప్లాట్‌ఫామ్‌లను ఓ వరంగా చూశారని సర్వే తెలిపింది.25 శాతంమంది మాత్రం అధికంగా వాటిమీద ఆధారపడడం, పక్షపాతధోరణి, మానవ సంబంధాలు తగ్గిపోవడం, భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేశారని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో దాదాపు 47 శాతం మంది చాట్‌జిపిటిని ఉపయోగిస్తుండగా..44 శాతం మంది దాన్ని ఉపయోగించడం లేదు.

దీన్ని బట్టి మెజారిటీ వ్యక్తులు చాట్‌జిపిటిని అందిపుచ్చుకున్నారని సర్వేలో తేలింది. ఎఐటూల్స్ ద్వారా ఒకే పనిని రెండుసార్లు ఉపయోగించకుండా పనిభారాన్ని తగ్గిస్తాయని, తప్పులు సరిదిద్దుతాయని 67 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీనివల్ల పనితీరు మెరుగ్గా జరుగుతుందని తెలిపారు. ఎఐపరంగా కొత్త తరహా ఉద్యోగాలు పెరగడంతో పాటుగా ఉత్పాదకత పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్త చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు ఎఐ సాంకేతికత తెచ్చే ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంటే అదే సమయంలో మరి కొందరు దీనిపట్లు ఆందోళన వ్యక్తం చేస్తుండడం స్పష్టంగా కనిపిసోతని జీనియస్ కన్సల్టెంట్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పి యాదవ్ తెలిపారు. అయితే ఈ రెండు ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే ఉద్యోగుల ఆందోళనకు సరైన పరిష్కారాన్ని తీసుకురావలసిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News