Monday, April 29, 2024

వరంగల్‌లో జెన్‌ప్యాక్ట్ టెక్ సెంటర్

- Advertisement -
- Advertisement -

Genpact to set up tech centre in Warangal

దీనితో వరంగల్‌లో ఐటి మరింత బలోపేతమవుతుంది
వచ్చే ఆరు నెలల్లో ఈ టెక్ సెంటర్ మొదలవుతాయి : మంత్రి కెటిఆర్ ట్వీట్
250 ఐటి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రికి తెలియజేసిన జెన్‌ప్యాక్ట్ సిఇఒ త్యాగరాజన్
వరంగల్‌కు జెన్‌ప్యాక్ట్‌ను తీసుకొస్తున్న మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు : మంత్రి ఎర్రబెల్లి

మన తెలంగాణ/హైదరాబాద్ : వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు జెన్‌పాక్ట్ సంస్థ ముందుకు వచ్చింది. జెన్‌పాక్ట్ రాకతో వరంగల్ ఐటి మరింత బలోపేతం అవుతుందని పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్‌చేశారు. కంపెనీ సిఇఒ త్యాగరాజన్.. మంత్రి కెటిఆర్‌తో గురువారం సమావేశమై చర్చించాచరు. ఇప్పటికే సైయంట్, టెక్ మహీంద్ర కంపెనీలు వరంగల్ నుంచి ఆపరేట్ చేస్తుండగా వీటి సరసన జెన్‌పాక్ట్ చేరనుంది. వచ్చే ఆరు నెలల్లో వరంగల్‌లో ఈ టెక్ సెంటర్ సేవలను ఆరంభిస్తుందని.. తద్వారా వరంగల్‌లో 250 ఐటి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సిఇఒ త్యాగరాజన్ మంత్రి కెటిఆర్‌కు తెలిపారు. జెన్‌పాక్ట్ ప్రకటనపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు.

జెన్‌పాక్ట్ రాకతో వరంగల్ ఐటి మరింత బలోపేతం అవుతుందని మంత్రి ట్వీట్ చేశారు. ఇదిలావుండగా, తెలంగాణలో అభివృద్ధిని విస్తరించాలనే ఉద్దేశంతో వరంగల్‌కు జెన్‌ఫాక్ట్ ఐటి కంపెనీని తీసుకొస్తున్న ఐటి శాఖామంత్రి కెటి రామారావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాల శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఈమేరకు గురువారం మంత్రి దయాకర్‌రావు ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ తరువాత అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు ఇప్పటికే టెక్ మహేంద్ర, సైంట్, తాజాగా జెన్‌ఫాక్ట్ రావడం వరంగల్ వాసులకు గొప్ప అవకాశమన్నారు. వరంగల్‌లో ఐటిని విస్తరించాలనే ఉద్దేశంతో మంత్రి కెటిఆర్ శ్రద్ధ చూపిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలని మంత్రి దయాకర్‌రావు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News