Friday, April 26, 2024

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంమైంది. గ్రేటర్ 150 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ జరుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 8152 మంది సిబ్బంది, 31 మంది కౌంటింగ్ పరిశీలికులు ఉంటారు. ప్రతి టేబుల్ దగ్గర సిసి కెమెరాతో కౌంటింగ్ ప్రక్రియ రికార్డ్ అవుతోంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 34,50,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 30 కౌంటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులతోపాటు వాళ్ల ఏజెంట్లను మాత్రమే అనుమతించారు. గ్రేటర్ ఎన్నికల్లో తక్కువగా ఓట్లు నమోదైన మెహిదీపట్నం వార్డు ఫలితం మొదట వెలువడనుండగా, అత్యధికంగా ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లి ఫలితం ఆలస్యంగా వెలువడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మెహిదీపట్నం వార్డుకు కేవలం 11,818 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో రౌండ్‌కు 14 వేల ఓట్లు లెక్కించనుండగా, అంతకంటే తక్కువ ఓట్లున్న ఈ డివిజన్ ఫలితం త్వరగా వస్తుందని అధికారులు వివరించారు.

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్‌లో మొదటి రౌండ్ వివరాల వెల్లడి ఉదయం 11 గంటల తర్వాతనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో టేబుల్‌కు 1,000 ఓట్లు (40 బండిల్స్) లెక్కిస్తారు. అంటే ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News