Monday, April 29, 2024

అధికార, ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో రెడీ

- Advertisement -
- Advertisement -

నేడు జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం

హాజరు కానున్న 148 కార్పొరేటర్లు,
58 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు
సమావేశంలో 22 ప్రశ్నలపై చర్చ
టిఆర్‌ఎస్ 3, ఎంఐఎం7,
బిజెపి 11, కాంగ్రెస్ 1 చొప్పున ప్రశ్నలు

GHMC meeting in Hyderabad

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం శనివారం 10 గంటలకు ప్రారంభం కా నుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో గత జూన్ 29వ తేదీన పర్చువల్ ద్వారా జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కొత్త పాలకమండలి కొలువుదీరినా 10 నెలల తర్వాత తొలిసారిగా ముఖాముఖి గా జరుగుతున్న సర్వసభ్య సమావేశం ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశానికి ఆయా పార్టీలు అస్త్ర శస్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రజా స మస్యల పేరుతో ప్రతిపక్షా పార్టీ బిజెపి అధికార పక్షం టిఆర్‌ఎస్‌ను ఇరుక్కున పెట్టేందుకు వ్యూహా రచన చేస్తుండగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలతో వారి జిమిక్కులను తిప్పికొట్టేందుకు టిఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు సంసిద్ధం అవుతున్నారు. అదేవిధం గా టిఆర్‌ఎస్‌కు సేహ్న హస్తం అందించిన ఎంఐఎం పార్టీ సైతం సభలో బిజెపిని నిలువరించేందుకు సిద్దం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు కార్పొరేటర్లు ఉండడంతో వారు సైతం ప్రజా సమస్యలపై గళం విప్పే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ పార్టీ 3, ఎంఐఎం 7, బిజెపి 11, కాంగ్రెస్ 1, మొత్తం 22 ప్రశ్నలు చర్చకు రానున్నట్లు సమాచారం.
హాజరు కానున్న 58 మంది ఎక్స్‌ఆఫీషియో సభ్యులు
ఈ సర్వసభ్య సమావేశానికి 148మంది కార్పొరేటర్లతో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు 58మంది ఎక్స్ ఆఫీసియో సభ్యులు హాజరు కానున్నారు. జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం ప్రా రంభం కాగానే ముందుగా పాలక మండలి ఇటీవల మృతి చెందిన పలువురికి సంతాపం తెలునుంది. హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందిన సిడిఎస్ జనరల్ బిపి రావత్‌తోపాటు సైనికఅధికారులతో పాటు ఇ టీవల మరణించిన పలువురు ప్రముఖులకు సంతాపం తెలపనున్నారు. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సభ్యులుగ ఎన్నికైన వారి సమావేశానికి మేయర్ పరిచయం చేయనున్నారు. అనంతరం ప్రజా సమస్యలపై అనంతరం సమావేశం ముందుగా ఎక్స్ ఆఫీషియో సభ్యులు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను సభ్యుల ముందు పెట్టి అమోదం తీసుకోనున్నారు. అనంతరం సభ్యులు లేవనేత్తిన ప్రశ్నలపై చర్చ జరగనుంది. అయితే ప్రస్తుతం బిజెపి, టి ఆర్‌ఎస్ పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వేడిగా కారణంగా వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి. బిజెపి సహకరిస్తే పూర్తి స్థాయి సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే మధ్యనే వాయిదా పడే అవకాశం లేకపోలేదు.
భద్రత కట్టుదిట్టం
జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల బిజెపి కార్పొరేటర్లు నిరసన పేరుతో మేయర్ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడిన నేపథ్యంలో ఈసారి భారీ భద్రత చర్యలను చేపట్టారు. కౌన్సిల్‌లో వాడి వేడి చర్చ జరిగే అవకాశాలుండడంతో బిజెపి నిరసన సైతం దిగ్గే అవకాశాలు కూడా ఉండడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇం దులో భాగంగా జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోకి కార్పొరేటర్ల తప్పించి మిగిత ఎవరి అనుమతించకుండా భద్రత చర్యలు తీసుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News