Sunday, April 28, 2024

మంచి వ్యక్తితో జీవితాన్ని పంచుకోబోతున్నా

- Advertisement -
- Advertisement -

Going to share life with a good person:Kangana

 

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ కెరీర్ ఆరంభంలోనే ప్రేమలో పడింది. అయితే ఆమె ముక్కుసూటితనం, ఇతర వ్యవహారాల వల్ల ఇద్దరికి సెట్ కాలేదట. దీంతో మొదటి బ్రేకప్ అయిన కంగనా ఆ తర్వాత ఒక స్టార్ హీరోతో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ అతనితో ఎక్కువ కాలం కంగనా రిలేషన్‌ను కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత నుండి కంగనా రిలేషన్‌షిప్, లవ్ వ్యవహారాల గురించి మీడియాలో పెద్దగా వార్తలు రాలేదు. కానీ ఆమె వివాదాలు, గొడవల గురించి మాత్రం రెగ్యులర్‌గా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె గురించి మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అభిమానులు కంగనా పెళ్లి చేసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ విషయమై కంగనా రనౌత్ స్పష్టంగా మాట్లాడింది. రాబోయే ఐదు ఏళ్లలో పెళ్లి చేసుకోవడంతో పాటు పిల్లలను కూడా కంటానంటూ ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోవాలని తనకు ఉందని.. పిల్లలను కని నవ భారత నిర్మాణంలో తాను భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొంది. ఇటీవలే పద్మ అవార్డును దక్కించుకున్న కంగనా రనౌత్ పలు సినిమాల్లో నటనకు గాను ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది. అందులో జాతీయ అవార్డులు కూడా ఉన్నాయి. కంగనా రనౌత్‌కు సినిమాలపైనే కాకుండా వ్యక్తిగత జీవితంపై కూడా చాలా శ్రద్ధ్ద ఆసక్తి ఉందని తాజాగా ఆమె చెప్పిన మాటల వల్ల తెలుస్తుంది. ఒక మంచి వ్యక్తితో తాను జీవితాన్ని పంచుకోబోతున్నానని.. అతను ఎవరు అనే విషయాన్ని త్వరలోనే అందరికి తెలియజేస్తానని కంగనా చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News