Monday, April 29, 2024

లోక్‌సభలో క్రిప్టోకరెన్సీ బిల్లు ?!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 26 బిల్లుల్లో ‘ద క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్2021’ ను కూడా జాబితాలో చేర్చారు.  కాగా కొన్ని మినహాయింపులతో భారత్‌లో అన్ని రకాల ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలనే ఉద్దేశ్యంతోనే క్రిప్టో బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు.  ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వం కొన్ని మినహాయింపులతో క్రిప్టోకరెన్సీ అండర్‌లైయింగ్ టెక్నాలజీని, దాని ఉపయోగాలను ప్రమోట్ చేయబోతున్నది. ప్రస్తుతం దేశంలో క్రిప్టోకరెన్సీలు ఉపయోగించడంపై ఎలాంటి నిషేధం లేదు. అలాగే రెగ్యులేషన్స్ కూడా లేవు. ఇదిలావుండగా మూడు కొత్త  వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోబోయే బిల్లును కూడా ప్రవేశపెడుతున్నారు.

ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీల ధరలు ఈ నెల అత్యధిక స్థాయి నుంచి ఆగిపోయాయి. కాగా మంగళవారం అవి పైకే ట్రేడయ్యాయి. అయితే లోక్‌సభలో క్రిప్టోకరెన్సీపై బిల్లు ప్రవేశపెడతారన్న ప్రకటన తర్వాత క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో గణనీయ కదలిక ఏదీ కనపడలేదు. కాయిన్‌మార్కెట్‌క్యాప్ డాట్ కామ్ ప్రకారం 24 గంటల్లో బిట్‌కాయిన్ 0.09 శాతం పెరుగగా, ఇథెరమ్ 2.68 శాతం పెరిగింది. ఈ నెల మొదట్లో ప్రధాని నరేంద్ర మోడీ క్రిప్టోకరెన్సీపై సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. అంతేకాక క్రిప్టోకరెన్సీ విషయంలో రెగ్యులేటరీ చరలు తీసుకోబోతున్నాం అనే సూచనలు ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News