Thursday, May 16, 2024

ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్

- Advertisement -
- Advertisement -

Greater Elections polling closed

 

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మంగళవారం సాయంత్రం  ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 37 శాతం పోలింగ్ నమోదైంది.  149 డివిజన్లలో ఓటింగ్ ముగిసింది. గుర్తులు తారుమారుకావడంతో ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ ను రద్దు చేశారు. ఎల్లుండి ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఈ నెల 4న గ్రేటర్ ఎన్నికలు ఫలితాలు వెల్లడవుతాయి. రీపోలింగ్ వల్ల ఎల్లుండి సాయంత్ర 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధించారు. హైదరాబాద్ లో భారీగా పోలింగ్ తగ్గింది.   గత ఎన్నికలతో పోలిస్తే భారీగా పోలింగ్ శాతం తగ్గింది. 2009లో 42.95 శాతం, 2014లో 50.86 శాతం పోలింగ్ నమోదైంది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటింగ్ అవకాశం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News