Monday, April 29, 2024

45వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ఆరంభం

- Advertisement -
- Advertisement -

కోవిడ్ ఔషధం,పెట్రోల్ పన్ను విధానంపై ఫోకస్
న్యూఢిల్లీ: వస్తు,సేవల పన్ను మండలి(జిఎస్‌టి కౌన్సిల్)45వ కీలక సమావేశం శుక్రవారం లక్నోలో ఆరంభమైంది. ఈ సమావేశంలో కోవిడ్-19 ఔషధాలకు రాయితీలు, ఇతర అనేక వస్తువులపై అంటే కొబ్బరి నూనె, ఆంకాలజీ ఔషదం వంటి వాటిపైన పన్ను రేట్ల పునఃసమీక్షపై దృష్టి పెట్టబోతున్నారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన ఈ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో మొదటి సమావేశమని చెప్పాలి. ఇదివరలో 20 నెలల క్రితం 2019 డిసెంబర్ 18న జిఎస్‌టి కౌన్సిల్ జరిగింది. ఆ సమావేశానికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా హాజరయ్యారు. ప్రస్తుత సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించలేదు. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
పన్ను ఎగవేత విషయాన్ని చర్చించడంతోపాటు ఫుడ్ డెలివరీ యాప్స్‌ అంటే జొమాటో, స్విగ్గీ వంటి వాటిని రెస్టారెంట్లుగా  భావించి వాటి సరఫరాపై 5 శాతం జిఎస్‌టి విధించే అంశంపై కూడా చర్చించనున్నారు.
ఈ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం 80లక్షల రిజిష్టరయిన సంస్థలకు క్రమంగా ఆధార్ అథారిటీ గుర్తింపును తప్పనిసరి చేసే విషయాన్ని కూడా పరిశీలించనుంది. 2021 డిసెంబర్ 31 వరకు మరో ఏడు ఔషధాలపై జిఎస్‌టిని 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనను కూడా ఈ సమావేశం చర్చించబోతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News