Monday, April 29, 2024

తెలంగాణకు బిజెపి చేసిందేమిటి?: గుత్తా

- Advertisement -
- Advertisement -

Gutta Sukender Reddy slams Centre Govt
హైదరాబాద్: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైతాంగాన్ని అవమానపరిచేలా మాట్లాడారని ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల తరపున మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులను పనీపాట లేక ఢిల్లీకి వచ్చారని అనడం బాధ్యతారాహిత్యమని, కేంద్రం బాధ్యతలను గుర్తు చేయడానికే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తితో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు. అమిత్ షా తెలంగాణ బిజెపి నాయకులను పిలిచి రాజకీయాలు చేస్తున్నారని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల గురించే ఆలోచిస్తుందని, రైతు బంధు, రైతు బీమా తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు.

తెలంగాణలో ఐకెసి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, మహిళా సంఘాలు, హమాలీలకు ఉపాధి దొరికిందన్నారు. రైతులను కాపాడే ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని, కాంగ్రెస్, బిజెపిలు రైతుల మీద రాజకీయం చేసే పార్టీలు అని దుయ్యబట్టారు. రైతుల గురించి ప్రతిపక్ష పార్టీ ఏ రోజు కూడా కేంద్రాన్ని నిలదీయలేదని, దేశంలో ఏడున్నరేళ్లుగా బిజెపి వ్యాపార సంస్థలాగా పని చేస్తోందని, వ్యవసాయాన్ని కార్పొరేటుపరం చేసేందుకు బిజెపి మూడు నల్లచట్టాలు తెచ్చాయని ధ్వజమెత్తారు. ఇప్పటికే తెలంగాణ రైతులు లాభసాటి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేస్తున్నారన్నారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచితంగా కరెంట్ అందిస్తోందని, భవిష్యత్ అవసరాల దృష్టా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేశారని ప్రశంసించారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మెచ్చుకున్నారు. తెలంగాణకు కేంద్రం ఏ చేసిందో చెప్పాలని నిలదీశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణకు రావాల్సిన ఒక్క జాతీయ ప్రాజెక్టు రాలేదని మోడీ ప్రభుత్వానికి చురకలంటించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు బిజెపి కుట్రలు చేస్తోందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News