Saturday, April 27, 2024

హెచ్1బి వీసాలపై సందిగ్ధంలో బైడెన్ సర్కార్!

- Advertisement -
- Advertisement -

హెచ్1బి వీసాలపై సందిగ్ధంలో బైడెన్ సర్కార్!
ట్రంప్ విధించిన నిషేధం ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోని కొత్త ప్రభుత్వం
ఈనెల 31తో ముగియనున్న నిషేధం గడువు

Democratic party slams Trump's Govt over H1B Restrictions

వాషింగ్టన్: ట్రంప్ హయాంలో అమలైన పలు ఇమ్మిగ్రేషన్ విధానాలను మార్చిన జో బైడెన్ ప్రభుత్వం హెచ్1బి వీసాల జారీపై మాజీ అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని ఎత్తివేసే విషయంలో మాత్రం సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యంలో విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్1బి వీసాల జారీపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని హోంల్యాండ్‌సెక్యూరిటీ మంత్రి అలెజాండ్రో మేయర్కాస్ తెలిపారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ హెచ్1 బి వీసాల జారీ నిలిపివేతను మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోవడం, అధిక సంఖ్యలో విదేశీ కార్మికులకు ప్రస్తుత పరిస్థితుల్లో పని కల్పించే స్థితిలో అమెరికా లేదన్న కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ట్రంప్ ప్రకటించారు. అయితే కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.. ట్రంప్ హయాంలో ఇమ్మిగ్రేషన్ విషయంలో తీసుకున్న నాటి నిర్ణయాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ముస్లిం వీసా బ్యాన్ తొలగింపు, గ్రీన్ కార్డు పరిమితి ఎత్తివేత వంటి వాటిని బైడెన్ అమలు చేశారు. కానీ హెచ్1బి వీసాల జారీ నిలిపివేతపై మాత్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

ఈనెల 31తో ఈ నిషేధం గడువు ముగుస్తుండడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం విలేఖరుల సమావేశంలో ఈ విషయంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయంపై తనకు ఎలాంటి వివరాలు తెలియవని అలెజాండ్రియా చెప్పారు. ప్రస్తుతం తమ పరిపాలనా విభాగం అమెరికా పునరుద్ధరణ, పునర్నిర్మాణంపైనే దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చారు.అలాగే యుఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్)విభాగం కూడా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్1బి దరఖాస్తుల ప్రాసెస్‌లో తలమునకలై ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సరిపడా హెచ్1బి వీసా దరఖాస్తులు స్వీకరించినట్లు యుఎస్‌సిఐఎస్ ఇప్పటికే వెల్లడించింది. ఏటా అమెరికా విదేశీయులకు 65 వేల హెచ్1బి వీసాలను జారీ చేస్తుంది. అలాగే, మరో 20 వేల హెచ్1బి వీసాలను మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. ఇలా ప్రతి ఏటా అమెరికా విదేశీయులకు ఉపాధి కల్పించేందుకు మొత్తం 85 వేల హెచ్1బి వీసాలను ఇస్తోంది. ఇక హెచ్1బి వీసా విధానం అనేది నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు వీలు కల్పిస్తుంది. దీనిద్వారానే భారత్, చైనాలాంటి పలు దేశాలనుంచి ఏటా వేలాది మంది ఐటి నిపుణులు అగ్రరాజ్యంలో ఉపాధి పొందుతున్నారు.

H1B Visa ban expire until march 31

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News