Monday, April 29, 2024

దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని, ఒక్కొక్క వికలాంగుడు ఒక్కొక్క కేసీఆర్ కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారని, ఏ డిక్లరేషన్ చేసినా సొంత రాష్ట్రంలో చేస్తే నీతి నిజాయితీ ఉందన్నట్లు తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ముందుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఖర్గే మొదట డిక్లరేషన్ చేసి, ఇక్కడ తర్వాత డిక్లరేషన్ చేయాలని మంత్రి హరీశ్ దుయ్యబట్టారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్ లో బీడీ టేకేదార్లకు నూతన పింఛను మంజూరు, దివ్యాంగులకు పింఛన్ల పెంపు పత్రాల పంపిణీ, జూనియర్ పంచాయితీ కార్యదర్శిల ఉద్యోగ క్రమబద్దీకరణ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం పాల్గొని మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. దేశంలోని కర్ణాటక, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండి వెయ్యి రూపాయల పింఛను మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ జీహెచ్ఏంసీ ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తామని చెప్పారని గుర్తు చేసి ఇప్పటికీ బండి లేదు.. గుండు లేదని ఆరోపించారు.

బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి పెన్షన్ ఇవ్వడం లేదని, రాష్ట్రంలో 5 లక్షల 5 వేల 225 మంది దివ్యాంగులు ఉన్నారని, దివ్యాంగులు ప్రేమ కలవారని, మాటమీద ఉంటారని మీరు అడగకున్నా పెన్షన్ పెంచారని చెప్పుకొచ్చారు. గృహ లక్ష్మి పథకంలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని వికలాంగులు దివించాలని కోరారు. దేశంలోనీ 16 రాష్ట్రాల్లో బీడీలు చేసేవారు ఉంటే ఎక్కడ బీడీ పెన్షన్ ఇవ్వడం లేదని, బీడీ కార్మికులకే కాదు బీడీ టేకేదార్లకు 2016పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. మనకు అన్నం పెట్టే కేసీఆర్ మనం కాపాడుకోవాలని కోరారు.

జిల్లాలో జూనియర్ పంచాయితీ సెక్రటరీలు బాగా పని చేసి జిల్లాకు అవార్డుల పంట పండించారని అభినందించారు. జిల్లాలో 167మందికి రెగ్యులర్ చేస్తున్నామని, మిగిలిన 11 మందిని త్వరలోనే చేస్తామని హామినిచ్చారు. ఏ రాష్ట్రంలో లేని వసతులు ఇక్కడ కల్పిస్తున్నామని, కాంగ్రెస్ హయాంలో 5 గ్రామాలకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవారని, కానీ తెలంగాణ వచ్చాక మారిన పరిస్థితులకు అనుగుణంగా జిల్లాను మరింత అగ్రభాగాన నిలిపేలా సెక్రటరీలు నూతన ఉత్తేజంతో మరింత ముందుకు సాగాలని సూచించారు.సీఎం కేసీఆర్ ఆలోచన వల్లే రెగ్యులరైజేషన్ చేశారని మరువొద్దని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News