Monday, April 29, 2024

మహా ఉద్యమంలా సాగుతున్న హరితహారం

- Advertisement -
- Advertisement -
  • సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి/కంది: తెలంగాణ హరితహారం దేశంలో ఎక్కడ లేదని, పచ్చదనానికి సిఎం కెసిఆర్ సంకల్పంతో కృషి చేశారని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. సోమవారం కంది మండల పరిధిలోని చెర్యాల గ్రామంలో హరితోత్సవంలో కలెక్టర్ శరత్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నేడు హరితదినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సిం కెసిఆర్ చేపట్టిన హరితహారంతో తెలంగాణ రాష్ట్రం నేడు పచ్చగా మారిందన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నివాసయోగ్యమైన పరిసరాలను అందిద్దామన్నారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామిని చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే అన్నారు. నేడు పచ్చని పంటలతో మైదానం ప్రాంతం నిండుగా దట్టమైన చెట్లతో చూడ్డానికి అందంగా మారిందన్నారు. అదే విధంగా సంగారెడ్డిలోని జిల్లా గ్రంథాయలంలో గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డితో కలిసి చింత ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సరళ పుల్లారెడ్డి, జడ్‌పిటిసి కొండల్‌రెడ్డి, సర్పంచ్ శ్రావణ్‌కుమార్,మార్కెట్ కమిటీ చైర్మెన్ కృష్ణాగౌడ్, నాయకులు, విద్యార్థులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News