Saturday, April 27, 2024

భారత్ మార్కెట్ నుంచి హర్లే డేవిడ్సన్ ఔట్

- Advertisement -
- Advertisement -

Harley Davidson out of the Indian market

హైదరాబాద్ : అమెరికన్ దిగ్గజ బైక్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ భారతదేశ వ్యాపారం నుంచి వైదొలగనుంది. కంపెనీ తన ఖర్చులను 75 మిలియన్ డాలర్లు తగ్గించనుంది. దీనిలో భాగంగా హర్యానాలోని బవల్‌లో తయారీ కేంద్రాన్ని నిలిపివేసి, అలాగే గూర్గావ్‌లో సేల్స్ ఆఫీస్ పరిమాణాన్ని తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. హర్లె డేవిడ్సన్ డీలర్ నెట్‌వర్క్‌ను కొనసాగిస్తూ కస్టమర్ల సేవలను కొనసాగించనుంది. తద్వారా సంస్థ తన వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించబోతోంది.

ముఖ్యమై మార్కెట్లపై కంపెనీ దృష్టి సారిస్తుందని, పెట్టుబడికి అనుగుణంగా వాల్యూమ్, లాభాలు రాని దేశాల నుండి నిష్క్రమించడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలో కంపెనీ వ్యాపారాన్ని విలీనం చేయనున్నట్టు తెలిపింది. భారతదేశంలో అమ్మకాలు, తయారీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు హార్లే డేవిడ్సన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పదేళ్ల క్రితం భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన హార్లే డేవిడ్స్, పెట్టుబడులు పెట్టినప్పటికీ మార్కెట్‌ను పెంచుకోలేకపోయింది. 201920 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ భారతదేశంలో 2,500 బైక్‌లను మాత్రమే విక్రయించింది.

Harley Davidson out of the Indian market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News