Sunday, April 28, 2024

పవర్ ఆఫ్ సుబ్రమణ్యం టీజర్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సి బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుధీర్ బాబుకు ఇది అత్యంత భారీ బడ్జెట్ మూవీ. తాజాగా ఈ చిత్రం టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘హరోం హర’ పవర్ ఆఫ్ సుబ్రమణ్యం టీజర్ ఈనెల 27న విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నిప్పుల కొలిమిలో ఓ ప్రత్యేకమైన ఆయుధాన్ని కాల్చుతూ మజిల్ బాడీతో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు సుధీర్ బాబు.

ఈ పోస్టర్ సినిమాపై చాలా ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అక్షర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’ కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు పలకనున్నారు. ’హరోం హర’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News