Monday, April 29, 2024

బెంగళూరులో భారీ వర్షాలు.. కొట్టుకు పోయిన బంగారు నగలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : బెంగళూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అస్తవ్యస్తం అయింది. ఈ వరదల కారణంగా మల్లీశ్వర్ ప్రాంతం లోని ఓ నగల దుకాణం భారీగా నష్టపోయింది. ఆకస్మికంగా వరద నీరు దుకాణం లోకి ప్రవేశించడంతో రూ. 2 కోట్ల విలువైన బంగారం నగలు కొట్టుకుపోయాయని దుకాణం యజమాని ప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. దుకాణం సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనులే వరదలకు కారణమయ్యాయని ఆరోపించారు.

చెత్తా చెదారం కలిసిన వదర నీరు షాపు లోకి ఒక్కసారిగా పోటెత్తడంతో అక్కడి సిబ్బంది షట్టర్లు మూయలేక పోయారని తెలుస్తోంది. వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి సహాయం కోరామని, అయినా సహాయం అందలేదని ఆరోపించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలో భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. సుమారు 400కి పైగా చెట్లు నేల కూలాయి. వర్షం కారణంగా మున్సిపల్ కార్పొరేషన్‌కు 600 కు పైగా ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News