Monday, April 29, 2024

యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

wild Nagarjuna

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, – అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న ఈ సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక హైదరాబాద్‌లో 2007, 2013లలో జరిగిన బాంబుపేలుళ్ల ప్రధాన సూత్రధారులైన టెర్రరిస్టులను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ టీమ్ కథే ఇదని ట్రైలర్‌తో అర్థం అవుతోంది. ఇందులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మ అలియాస్ వైల్డ్ డాగ్ అనే ఎన్‌ఐఏ ఏజెంట్‌గా నాగ్ కనిపిస్తున్నాడు. నాగార్జునకు జోడీగా దియా మీర్జా నటించింది. నాగ్ కాస్త వయసు మీద పడిన పాత్రలో వైట్ హెయిర్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. దేశం కోసం ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టుకునే ఎన్‌ఐఏ టీమ్ గురించి ఈ చిత్రంలో చూపిస్తున్నారు. కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసిన నాగ్ మరోసారి వైవిధ్యమైన సినిమాతో వస్తున్నాడని తెలుస్తోంది. దీనికి తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. షానెల్ డియో సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద ఈ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సయామీ కేర్,- అతుల్ కులకర్ణి, – ఆలీ రెజా, – ప్రకాష్ సుదర్శన్, – బిలాల్ హుస్సేన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News