Monday, April 29, 2024

విశాల్‌కు కరోనా పాజిటివ్..

- Advertisement -
- Advertisement -

Hero Vishal Test positive for Corona

తమిళ్ స్టార్ హీరో విశాల్‌కు కరోనా సోకింది. తనకు, తన తండ్రికి, మేనేజర్‌కి కరోనా పాజిటివ్ వచ్చిందని విశాల్ స్వయంగా ప్రకటించి షాకిచ్చాడు. తన తండ్రికి సహాయకుడిగా ఉన్నందుకు తనకు కరోనా వచ్చిందని ఈ స్టార్ హీరో వెల్లడించాడు. ఈ వార్తతో విశాల్ అభిమానులు సహా కోలీవుడ్ ఉలిక్కిపాటుకు గురైంది. టాలీవుడ్‌లోనూ కంగారు మొదలైంది. కరోనా పాజిటివ్ రావడంతో తీవ్రమైన దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడ్డానని చెప్పిన విశాల్ ఆయుర్వేద వైద్య విధానం ద్వారా కోలుకున్నానని ట్వీట్‌లో తెలిపాడు. ప్రస్తుతం ప్రమాదం ఏదీ లేదు… మేమంతా ఆరోగ్యంగానే ఉన్నామని ఆయన వెల్లడించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Hero Vishal Test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News