Monday, April 29, 2024

హార్స్ రేసింగ్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Horse-Racing

హైదరాబాద్: హార్స్ రేసింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, కామాటిపుర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.81,000, టివి, సెట్‌టాప్ బాక్స్, 20మొబైల్ ఫోన్లు, క్యాలికులేటర్, ల్యాప్‌టాప్, వైఫై రౌటర్, రేస్‌ప్రొగ్రాం బుక్కులు, ఖాతాబుక్కును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మారేడ్‌పల్లి రుక్మీని దేవీకాలనీకి చెందిన దుగాడ్ అజిత్ కుమార్ జైన్ హెచ్‌ఆర్‌సి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు, యేగేష్ కుమార్, మీర్జా హిదాయతుల్లా బైగ్, ఎం. రవీందర్, రాజ్ కుమార్ సింగ్ అందరూ కలిసి హార్స్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

గతంలో కూడా ప్రధాన నిర్వాహకుడు అజిత్ జైన్ హార్స్ బెట్టింగ్ నిర్వహించేవాడు. ఐదు నెలల క్రితం బెట్టింగ్ గ్రూపును ఏర్పాటు చేశాడు. మారేడ్‌పల్లిలో అద్దెకు ఇల్లును తీసుకుని పంటర్స్ సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. వీరికి హైదరాబాద్,ముంబై, మైసూర్, చెన్నై, ఢిల్లీ తదితర నగరాల్లోని పంటర్ల సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సబ్ ఆర్గనైజర్లు ఇతడికి సహకరిస్తున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో పోలిశెట్టి ఎన్‌క్లేవ్‌పై దాడి చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు రాజశేఖర్ రెడ్డి, పరమేశ్వర్, శ్రీకాంత్ తదితరులు పట్టుకున్నారు.

Horse Racing Betting Gang Arrested at Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News