Monday, April 29, 2024

యెమెన్ హౌతీ స్థావరాలపై ముప్పేట దాడి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఎర్రసముద్రంలో దాడి విస్తరిస్తోంది. హౌతీ రెబెల్స్ అధీనంలోని యెయెన్‌పై ముప్పేట దాడులకు అమెరికా, బ్రిటన్ , మిత్రపక్ష దేశాలు మరిన్ని శక్తివంతమైన దాడులకు పాల్పడ్డాయి. ఈ పరిణామంతో ఆదివారం ఈ ప్రాంతంలో ఉద్రిక్తత మరింత రగిలింది. దాడులను ముమ్మరం చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ ఆదివారం విలేకరులకు తెలిపారు. రెబెల్స్‌ను మరింత దెబ్బతీసేందుకు ఈ దాడులు సంకల్పించినట్లు వివరించారు. తమకు ఇప్పుడు బ్రిటన్ ఒక్కటే కాకుండా ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్ , న్యూజిలాండ్, నెదర్లాండ్స్ నుంచి కూడా మద్దతు దక్కిందని, క్షేత్రస్థాయి దాడులకు ఈ మిత్రపక్ష దేశాలు సహకరిస్తున్నాయని ఆయన వివరించారు. తమ దేశాలకు చెందిన సైనిక బలగాల నుంచి ఆ ప్రాంతంలోని నిర్ధేశిత స్థావరాలపై వైమానిక, క్షిపణి దాడులను ఉధృతం చేశాయని తెలిపారు.

ఇప్పటి తమ చర్యతో యెమెన్‌లోని రెబెల్స్‌కు నిర్థిష్ట హెచ్చరికల సంకేతాలు వెలువడుతాయి. అంతర్జాతీయ వాణిజ్య నౌకా రవాణాను అడ్డుకున్నా, వాణిజ్య ప్రక్రియను అక్రమంగా అటకాయించినా తగు ఫలితం ఉంటుందని తాము ఈ సైనిక చర్యలతో వారికి కరకుగా తెలియచేసినట్లు స్పష్టం చేశారు. తాజాగా హౌతీలకు చెందిన 36 స్థావరాలపై బ్రిటన్, అమెరికా సేనలు భీకరదాడికి పాల్పడ్డాయి. తమ సేనలు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న హౌతి క్షిపణిని యాంటి మిస్సైల్‌తో ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా ఆధ్వర్యంలో సాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో శాంతికి భంగం ఏర్పడిందని ఐరాస ప్రతినిధికి ఇరాన్ తెలిపింది. దాడులను హౌతీ వర్గాలు ఖండించాయి. తాము కూడా భీకర స్థాయిలోనే ఎదురుదాడులకు దిగుతామని , భయపడేది లేదని స్పష్టం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News