Monday, April 29, 2024

గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటా!

- Advertisement -
- Advertisement -

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరిస్తుంది
ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు గృహవసతి కల్పిస్తాం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా చూస్తానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు గృహవసతి కల్పిస్తామన్నారు. మంత్రుల కార్యాలయంలో, రెవెన్యూ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్స్ అండ్ వర్క్ ఇన్‌స్పెక్టర్స్ డైరీ అండ్ క్యాలండర్‌ను శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం బాధ్యత తనది కాదన్నారు… గత ప్రభుత్వం హౌసింగ్‌ను, ఉద్యోగులను ఛిద్రం చేసి ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, సంఘం అధ్యక్షుడు గవ్వ రవీందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బొగ్గుల వెంకట రామిరెడ్డి, కార్యదర్శి రఘువీర్ ప్రసాద్ గుప్తా, జనరల్ మేనేజర్లు చైతన్య తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News