Monday, April 29, 2024

ఎఫ్‌డి రేట్లను పెంచిన ఐసిఐసిఐ బ్యాంక్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ తర్వాత ఇప్పుడు ప్రైవేట్ రంగ ఐసిఐసిఐ బ్యాంక్ ఎఫ్‌డి (ఫిక్స్‌డ్ డిపాజిట్) రేట్లను పెంచింది. కొత్త రేట్లు జూన్ 16 నుండి అమలులోకి వచ్చాయి. సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లు బ్యాంకు నుండి ఎక్కువ వడ్డీని పొందుతున్నారు. రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డిలకు ఐసిఐసిఐ బ్యాంక్ 7 రోజుల నుండి 29 రోజులకు గాను సాధారణ కస్టమర్లకు 2.75 శాతం వడ్డీని ఇస్తోంది. మరోవైపు సీనియర్ సిటిజన్లు ఇదే కాలానికి 3.25 శాతం వడ్డీని ఇస్తోంది. అంటే సాధారణ పౌరులతో పోలిస్తే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తోంది. 30 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డి ఉన్న వారికి బ్యాంకు 3.25 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.75% వడ్డీ లభిస్తోంది. 91 రోజుల నుండి 184 రోజుల వరకు ఎఫ్‌డిలు పొందుతున్న సాధారణ వ్యక్తులకు 3.75% వడ్డీ, 185 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ ఎఫ్‌డిలపై 4.60% వడ్డీ, ఒక సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఎఫ్‌డిలపై 5.30% లభిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News