Monday, April 29, 2024

ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో మెగా ర్యాలీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అర్వింద్ కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసినందుకు నిరసన సూచకంగా రామ్‌లీలా మైదాన్‌లో ‘ఇండియా’ కూటమి మెగా ర్యాలీ నిర్వహణకుఢిల్లీ పోలీసులు అనుమతిఇచ్చారు. ప్రతిపక్ష కూటమిలో భాగమైన 13 పార్టీలు మెగా ర్యాలీలో పాల్గొంటాయని, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరవుతారని కూటమి వర్గాలు వెల్లడించాయి. జైలు నిర్బంధితుడైన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కూడా ర్యాలీలో ప్రసంగిస్తారని ఆ వర్గాలు తెలిపాయి.

ఝార్ఖండ్ సిఎం పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఇడి జనవరిలో అరెస్టు చేసింది. ర్యాలీకి హాజరు కానున్న ‘ఇండియా’ కూటమి ఇతర నేతలలో వెటరన్ రాజకీయ నేత శరద్ పవార్, శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాక్కరే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్కరే, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చాంపై సోరెన్, టిఎంసి ఎంపి డెరెక్ ఓబ్రియన్, సిపిఐ (ఎం) నేత సీతారామ్ ఏచూరి కూడా ఉన్నారని ఆ వర్గాలు తెలియజేశాయి. ‘నియంతృత్వం తొలగాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అనే బ్యానర్ కింద ర్యాలీ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News