Monday, April 29, 2024

రేపు భారత్ చైనా 13వ దఫా చర్చలు

- Advertisement -
- Advertisement -

India-China 13th round of talks tomorrow

న్యూఢిల్లీ : లద్ధాఖ్ ప్రతిష్టంభనపై భారత్‌చైనా మధ్య 13వ దఫా సైనికాధికారుల స్థాయి చర్చలు ఆదివారం (నేడు) జరుగుతాయి. ఈ ప్రాంతంలో తిరిగి ఉద్రిక్తతలు తలెత్తకుండా చేయడం, పూర్తి స్థాయిలో సైనిక ఉపసంహరణ వంటి విషయాలపై ఈ కార్ప్ కమాండర్ల స్థాయి భేటీ ఉంటుంది. ఈసారి చర్చలు చైనా భూభాగంలోని బిపిఎం పాయింట్ వద్ద జరుగుతాయి. భారత ప్రతినిధి బృందానికి కార్ప్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పిజికె మీనన్ సారధ్యం వహిస్తారు. చైనా వైపున అక్కడి సైనిక మేజర్ జనరల్ లియూ లిన్ నాయకత్వం వహిస్తారు. ఈ ప్రాంతంలో చైనా భారీ స్థాయిలో సైనిక సమీకరణకు దిగుతోంది, పెద్ద ఎత్తున మౌలిక సాధనాసంపత్తిని ఏర్పాటు చేసుకొంటోందని, ఇది అవాంఛనీయం అని ఇటీవలే భారత సైనిక ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తెలిపారు. అయితే ప్రతి పరిణామాన్ని చూస్తూ ఉండటం కుదరదని , అవసరం అయితే తగు విధంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇక్కడ అత్యంత అధునాతన శతఘ్నుల దళాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నామని ఆర్మీచీఫ్ తెలిపారు. అయితే ఆదివారం నాటి సంప్రదింపులతో జటిలత పరిష్కారానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News