Monday, April 29, 2024

లింగ సమానత్వంలో భారత్‌కు 140వ స్థానం

- Advertisement -
- Advertisement -

లింగ సమానత్వంలో 28 స్థానాలు
దిగజారిన భారత్‌కు 140వ స్థానం: ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక


న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్లూఇఎఫ్) వెల్లడించిన లింగ వివక్ష సూచి నివేదిక 2021లో భారత్ 28 స్థానాలు దిగజారింది. 156 దేశాల జాబితాలో భారత్ 140వ స్థానంలో నిలిచింది. గతేడాది నివేదికలోని 153 దేశాల్లో భారత్ 112వ స్థానంలో నిలిచింది. భారత్‌లో మహిళల పట్ల వివక్ష 62.5 శాతం ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది. ముఖ్యంగా రాజకీయాల్లో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేదని నివేదిక తెలిపింది. 2019లో మహిళా మంత్రులు 23.1 శాతం ఉండగా, 2021లో అది 9.1 శాతంకు పడిపోయిందని నివేదిక పేర్కొన్నది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం 24.8 శాతం నుంచి 22.3 శాతానికి తగ్గింది. ఈ సూచీలో పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 65, నేపాల్ 106, పాకిస్థాన్ 153, ఆఫ్ఘనిస్తాన్ 156, భూటాన్ 130, శ్రీలంక 116 స్థానాల్లో నిలిచాయి. 12వసారి వరుసగా లింగ సమానత్వమున్న ప్రపంచ దేశాల్లో ఐస్‌ల్యాండ్ మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఫిన్‌ల్యాండ్, నార్వే, న్యూజీల్యాండ్, రువాండా, స్వీడన్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ నిలిచాయి.

India falls 28 spots on 2021 Global Gender Equality

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News