Monday, April 29, 2024

తూర్పులడఖ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు నిర్మించిన భారత్

- Advertisement -
- Advertisement -
India has built highest road in world in East Ladakh
బొలీవియా రికార్డు బ్రేక్..!!

న్యూఢిల్లీ: తూర్పులడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు నిర్మాణాన్ని భారత్ పూర్తి చేసిందని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. దీంతో, గత ప్రపంచ రికార్డు బ్రేకయిందని ఆ వర్గాలు తెలిపాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉమ్‌లింగ్లాపాస్‌లో 19,300 అడుగుల ఎత్తున నిర్మించిన ఈ రహదారి ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైనదిగా రికార్డు సాధించింది. బొలీవియాలో 18,953 అడుగుల ఎత్తున నిర్మించిన రోడ్డు ఇప్పటివరకు ప్రపంచంలో ఎత్తైనది కాగా, ఇప్పుడు ఆ రికార్డు బ్రేకయింది. ఎవరెస్ట్ పర్వతాల వద్ద నిర్మించిన బేస్‌క్యాంప్‌లకన్నా ఎత్తైన ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. నేపాల్‌వైపు దక్షిణ ఎవరెస్ట్‌పై 17,598 అడుగుల ఎత్తున ఓ బేస్‌క్యాంప్ ఉండగా, టిబెట్‌వైపున ఉత్తర ఎవరెస్ట్‌పై 16,900 అడుగుల ఎత్తున మరో బేస్‌క్యాంప్ ఉన్నది. ఉమ్‌లింగ్లాపాస్‌లో నిర్మించిన ఈ రహదారి వల్ల లడఖ్‌లో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. చలికాలంలో మైనస్ 40 డిగ్రీలకు ఉష్టోగ్రత పడిపోయే ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని భారత్ సవాల్‌గా తీసుకున్నది.

India has built highest road in world in East Ladakh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News