Friday, May 17, 2024

ఇండియానాపోలిస్‌లో అబార్షన్లపై నిషేధం

- Advertisement -
- Advertisement -

Indiana bans abortions

ఇండియానాపోలిస్(అమెరికా): అమెరికాలో అబార్షన్లు ఇక రాజ్యాంగ హక్కు కాదంటూ అమెరికా సుప్రీంకోర్టు తాజాగా చారిత్రాత్మక తీర్పును వెలువరించిన తర్వాత దేశంలో తొలిసారి ఇండియానా రాష్ట్రం అబార్షన్లపై శుక్రవారం నిషేధాన్ని విధించింది. పార్లమెంట్‌లో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలియచేయడంతో అబార్షన్లపై నిషేధాన్ని విధిస్తూ ఇండియానా రిపబ్లిక్ గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి రానున్న ఈనిషేధం అబార్షన్లపై కొన్ని మినహాయింపులు మాత్రం ఇచ్చింది. అత్యాచారానికి గురైన మహిళలు, అక్రమ సంబంధం ద్వారా గర్భం దాల్చిన మహిళలకు కొన్ని మినహాయింపులు ఇస్తూ గర్భస్త శిశువు 10 వారాలలోపు ఉన్న పక్షంలో తల్లి జీవితం, ఆరోగ్యాన్ని పురస్కరించుకుని అబార్షన్ చేయించుకోవచ్చు. అంతేగాక గర్భస్త శిశువులో శారీరక లోపాలు ఉన్నట్లు డయాగ్నసిస్‌లో బయటపడితే అబార్షన్ చేయించుకోవచ్చని బిల్లులో పొందుపరిచారు. అబార్షన్లను ఆసుపత్రులలో మాత్రమే చేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలోని అబార్షన్ క్లినిక్‌లు అన్నీ తమ లైసెన్సులు కోల్పోనున్నాయి. చట్టవిరుద్ధంగా ఏ డాక్టరయినా అబార్షన్ చేసిన పక్షంలో తన వైద్య లైసెన్సును కోల్పోవలసి వస్తుందని బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News