Sunday, April 28, 2024

ఇండియా తొలి క్రిప్టోగేమిక్ గార్డెన్

- Advertisement -
- Advertisement -

India's first cryptogamic garden opened in Uttarakhand

 

డెహ్రాడూన్ : భారతదేశపు తొలి క్రిప్టోగేమిక్ గార్డెన్‌ను ఉత్తరాఖండ్‌లో ఆదివారం ప్రారంభించారు. దాదాపుగా 50 రకాల ఫంగి, ఫెర్న్ వంటి రకాలు ఈ గార్డెన్‌లో ఉంటాయి. రాష్ట్రంలోని చక్రతా టౌన్‌లో ఈ గార్డెన్‌ను సామాజిక ఉద్యమకర్త అనూప్ నౌటియాల్ ఆదివారం ఆవిష్కరించారు. 9వేల అడుగుల ఎత్తున ఈ తోట నెలకొందని అటవీ శాఖ ప్రధాన పరిరక్షణాధికారి సంజీవ్ చతుర్వేది తెలిపారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో దీనిని రూపొందించారు. ఈ ప్రాంతంలోని తక్కువ స్థాయి కాలుష్యం, తేమ వాతావరణం వంటివి ఇక్కడి వృక్ష తెగల ఎదుగుదలకు పనికివస్తాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News