Monday, April 29, 2024

ఇంకా కనిపించని చిరుత.. భయం గుప్పిట్లో పబ్లిక్

- Advertisement -
- Advertisement -

Leopard

హైదరాబాద్: అడవులను వదిలి జనార్యణం బాటపడుతున్నాయి అడవి జంతువులు. గురువారం హైదరాబాద్ శివారులోని కాటేదాన్ జాతీయ రహదారిపై చిరుతపులి ప్రత్యక్షమైంది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకని చిరుతను పట్టకునేందుకు ప్రయత్నించారు. కానీ అది వారికి చిక్కకుండా ఫౌంహౌస్ లోనికి దూరింది. చిరుత కోసం 26గంటలుగా ఆపరేషన్ కొనసాగుతోంది. దాన్ని పట్టుకునేందుకు ఫౌంహౌస్ లో 20 సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.

కానీ చిరుత జాడలు ఎందులోనూ చిక్కలేదు. దీంతో చిరుత ఫౌంహౌస్ గోడ దూకి వెళ్లిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. ఫాంహౌంస్ లో చిరుత అడుగు జాడలు గుర్తిస్తున్నారు. వ్యవసాయ వర్సిటీలో ఉన్న దట్టమైన చెట్లు మధ్యలో నుంచి చిరుత వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. గగన్ పహాడ్ అటవీ, హిమయత్ సాగర్ చెరువు వైపు వెళ్లినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అడుగుజాడల ద్వారా పులి ఎక్కడికెళ్లిందో గుర్తిస్తున్నామని డిసిపి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ప్రజలెవరూ భయపడొద్దని డిసిపి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News