Sunday, April 28, 2024

అన్ని పంచాయతీల పనితీరు మెరుగు

- Advertisement -
- Advertisement -

Inspection app and PS app unveiled by Errabelli

 

రోజూ, నెలవారీ కార్యకలాపాల పర్యవేక్షణ
రెండు మొబైల్ యాప్స్‌లను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాతీల రోజూ, నెలవారి కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు వాటి పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలను తీసుకోనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. సోమవారం రాజధానిలోని పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ కార్యాలయంలో మంత్రి పల్లెప్రగతి-పిఎస్ యాప్(పంచాయతీ సెక్రటరీ యాప్), పల్లెప్రగతి-పర్యవేక్షణ యాప్(ఇన్స్ సెక్షన్ అధికారి యాప్)లను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ కోరిక అని, అందుకే సిఎం ఆదేశాల మేరకు ఈ రెండు యాప్‌లను ప్రారంభించినట్లు తెలిపారు, అంతేగాక, పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి, ప్రతి గ్రామానికి నర్సరీ, పల్లె ప్రకృతి వనం, చెత్తను వేరు చేసే డంపింగ్ యార్డు, వైకుంఠధామం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామని, పల్లెలో పనుల్లో పారదర్శకత, సమస్యల గుర్తింపు, పరిష్కారంలో వేగం పెంచడానికే ఈ రెండు యాప్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన ఈ యాప్‌ల ద్వారా అటు గ్రామ కార్యదర్శి స్థాయి నుండి ఇటు ఎంపిఓ , డిఎల్‌పిఓ, డిపిఓ , సిఇఓల వరకు చేయాల్సిన పనులను ఆయా పనులను పర్యవేక్షించే ప్రత్యేక టీమ్ బాధ్యతలను గుర్తు చేశారు. పల్లెప్రగతి పిఎస్‌లోని అంశాలను వివరిస్తూ ఇందులో రోజు వారి కార్యకలాపాలైన రోడ్లను శుభ్రపర్చటం, డ్రైనేజీలను శుభ్రం చేయటం, ప్రభుత్వ శాఖల ఆఫీసులను శుభ్రం చేయటం వంటివి ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇదే యాప్‌లో నెలవారి కార్యక్రమాలుగా పల్లె ప్రగతి పనులు, వాటర్ ట్యాంకులను శుభ్రపర్చటం, గ్రామ పంచాయతీ, గ్రామ సభ మీటింగ్, గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, గ్రామ పంచాయతీ జారీ చేసిన ఆమోదాలు, ధృవపత్రాలు, జనన, మరణాలు, వివాహాల రిజిస్ట్రేషన్లు, గ్రామ పంచాయతీ ఖర్చులు, ఆమోదించిన చెక్కులు, జీతాల రసీదు, గ్రామ పంచాయతీ కార్యకలాపాలపై మొబైల్ నోట్స్, మంచినీటి సరఫరాఇ, పారిశుద్ధ, ఉపాధి హామీ పనుల కమిటీల బ్యాంకు ఖాతాలు, పంచాయతీ పరిధిలోని బిల్లుల చెల్లింపులు, పిఎస్ మొబైల్ యాప్‌లో పంచాయతీ కార్యదర్శి నుంచి నివేదించిన కార్యకలాపాలు, డేటా తనిఖీ యాప్‌కు పోర్ట్ చేయబడినట్లు తెలిపారు.

తనిఖీ యాప్‌లోని తనిఖీ అధికారులు దీన్ని ధృవీకరిస్తారని తెలిపారు. తనిఖీలు నిర్వహించే అధికారులకు లక్ష్యాలను విధించనున్నట్లు తెలిపారు. పర్యవేక్షణ యాప్‌లోని అంశాలు వివరిస్తూ పారిశుద్ద పనులు, డెలివరీ స్థాయిని మించి అంచన వేయడానికి ఇళ్ల నుంచి అభిప్రాయాలు, ప్రభుత్వ సంస్థల శుభ్రత, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డు, నర్సరీలు, తోటల నిర్వహణ, జారీ చేసిన ఆమోదాలు, ధృవపత్రాలు, ఆర్థిక లావాదేవీలు, జిపి పాలన, రికార్డుల నిర్వహణను అధికారులు తనిఖీలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ యాప్‌ల ద్వారా ఇక నుంచి గ్రామ కార్యదర్శి నుంచి డిపిఓ జిల్లా స్థాయి అధికారుల వరకు వారి పనితీరును ఎప్పటికపుడు అధికారులు పరిశీలించనున్నట్లు తెలిపారు.

పల్లెప్రగతి పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం కింద తీసుకున్న పనులన్నీ వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా జడ్పీ ఆఫీసులోని పంచాయతీరాజ్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అమలవుతోందని అన్నారు. సిఎం కెసిఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం రూపొందించిన ఈ కార్యక్రమంలో పలు కీలకమైన, ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా అమలు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమం కింద చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, డంప్ యార్డులు, వైకుంఠధామమ్‌లు, కల్లాలు, రైతు వేదికలు, హరితహారం, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు సజావుగా అమలు జరిగి తీరాలని మంత్రి సూచించారు. నిర్ణీత లక్షాలకు అనుకూలంగా పని చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

రైతు వేదికల ఏర్పాటు సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలన్నారు. ప్రస్తుతం వర్షాకాల సీజన్ ముగిసి, పంటలు కోసి, లక్ష కల్లాల టార్గెట్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను త్వరగా పూర్తి చేసి స్థానిక ప్రజాప్రతినిధులతో ్ర పారంభించుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమాలన్నింటిని మిషన్ భగీరథ కార్యక్రమం కిందకు తీసుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలన్నీ ఖచ్చితంగా బతికి తీరాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘనందన్‌రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News