Sunday, April 28, 2024

ట్రంప్ బై.. బైడెన్ ఇన్ సజావేనా

- Advertisement -
- Advertisement -

Trump's intervention is crisis for Biden

 

2021 జనవరి 20 రాజ్యాంగ గడువు

న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఈసారి అసాధారణ రీతిలో అనిశ్చితతకు దారితీసింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఎన్నికల తరువాత అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా శాంతియుతంగా జరిగిన దాఖలాలే అత్యధికంగా ఉన్నాయి. ఈసారి ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నికల ఫలితాల చట్టబద్ధతపై సవాళ్లు విసురుతున్నప్పటికీ దేశంలో జరగాల్సిన రీతిలోనే అధికార మార్పిడి జరిగి తీరుతుందని జాతీయ భద్రతా వ్యవహారాల నిపుణులు తేల్చిచెపుతున్నారు. అయితే ట్రంప్ కాలం పోయి బైడెన్ దశ వచ్చేందుకు కొద్దివారాలు లేదా నెలలు పడుతుందని భావిస్తున్నారు. ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. కొత్త అధినేత వచ్చాడు. పాత కాపు ఇంటికి వెళ్లాడు. అనుకునే రీతిలో అమెరికా ఎన్నికలు, అధికారిక వ్యవస్థ లేదు. దేశానికి అత్యున్నత స్థాయి అధికార పీఠపు అధ్యక్ష స్థానం అధిరోహించే వ్యక్తి చట్టపరమైన అనేక కట్టుబాట సంపూర్తి వరకూ ఆగాల్సిందే.

ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అధికారికంగా పూర్తి కాలేదు. రాష్ట్రాలవారిగా అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థులకు దక్కిన ఓట్లు వాటి కథాకమామిషును అధికారికంగా డిసెంబర్ 14వ తేదీ నాటికి రూపొందుతుంది. ఈ విధంగా నూతన ఎలక్టోరల్ స్థానాల అభ్యర్థులు సిద్ధం అవుతారు. వారు ఓటు వేసేందుకు అర్హులు అవుతారు. ఈ దశలో ఏర్పాటు అయ్యే నూతన అమెరికా చట్టసభ ఎలక్టోరల్ కాలేజ్ ఫలితాలను ఆమోదించే ప్రక్రియను జనవరి 6 నుంచి చేపడుతుంది. ఇందులో బైడెన్ నెగ్గితే అనుకున్న విధంగానే జనవరి 20 మధ్యాహ్నానికి బైడెన్ ప్రమాణస్వీకారం చేసేస్తారు. ఈ మేరకు రాజ్యాంగంలో తేదీ ఖరారు అయింది.

ట్రంప్ చెలగాటం బైడెన్‌కు సంకటం

బైడెన్ అధికారం చేపట్టే ప్రక్రియను ట్రంప్ తన పలురకాల చర్యలతో తాబేటి నడకకు తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది. 1963 అధ్యక్ష మార్పిడి చట్టం ప్రకారంఇంతకు ముందు అధికారంలో ఉన్న వారు అధికార బదిలీలో కీలకం అవుతారు. ఇది అధికారుల విషయంలోనూ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చే వారి పట్ల కూడా వర్తిస్తుంది. అధికారం చేపట్టే వారికోసం తగు విధమైన గణాంకాలను ఇతరత్రా సమాచారాన్ని అందించేందుకు దిగిపోతున్న వారు తగు సమయం తీసుకునే వీలుంది. ఈ చట్టం ప్రకారం ఈ మార్పిడి ప్రక్రియలో యుఎస్ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జిఎస్‌ఎ) జోక్యం చేసుకుంటే వేగం సంతరించుకుంటుంది. ఈ క్రమంలోనే రాబోయే ప్రెసిడెంట్‌కు చెందిన బృందం అధికారిక పుస్తకాలు, నిధుల వివరాలను రాబట్టుకోవచ్చు. వారు ప్రభుత్వ సంస్థలను సందర్శించి రావచ్చు.దీనితో అధికార యంత్రాంగంపై రాబోయే ప్రెసిడెంట్‌కు పట్టు ఏర్పడుతుంది.

వెళ్లననే ప్రెసిడెంట్‌ను మిలిటరీ పంపించవచ్చా?

దేశంలో అధికారం వీడనని భీష్మించుకునే ఏ ప్రెసిడెంట్ అయినా అధికారం నుంచి తొలిగించే శక్తి సైన్యానికి ఉందా? అనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయాన్ని యుఎస్ ఆర్మీ వెటర్న్ ఇద్దరు తమ బహిరంగ లేఖల్లో యుఎస్ జనరల్ మార్క్ మిల్లేకు ఆగస్టులోనే ప్రస్తావించారు. అప్పట్లోనే వారు ట్రంప్ విషయాన్ని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ తన రాజ్యాంగపరమైన పదవీకాలం తరువాత కూడా పదవిలోనే ఉంటానని చెపితే తీసివేసేందుకు వీలుందా? అని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలకు దిగే అవకాశాల గురించి యుఎస్ సీక్రెట్ సర్వీసు తేల్చుకుంటుందని ఇతరులు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఈ ప్రక్రియలో సైన్యం పాత్ర లేనేలేదని చెప్పవచ్చునని వెల్లడైంది. అయితే నిర్ణీతంగా జనవరి 20 నాటికి ట్రంప్ వైట్‌హౌస్‌ను ఖాళీ చేయకపోతే చట్టపరంగా ఆయన అతిక్రమణదారుగా నిర్థారితులు అవుతారని అమెరికాలోని విదేశాంగ రక్షణ విధానాల సంస్థ నిపుణులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News