Monday, April 29, 2024

మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన మైనారిటీ, ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. ఆసక్తి కలిగిన అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ ఐషా మసరత్ ఖానం సూచించారు. టెమ్రీస్ అధికారిక వెబ్‌సైట్ www.tmreistelangana.caq.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు.

మైనారిటీలు (ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు), మైనారిటీయేతర (ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఒసి లు) కమ్యూనిటీల నుండి అర్హులైన అభ్యర్థులు టెమ్రీస్ మొబైల్ యాప్ (గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా 204 టిఎంఆర్ పాఠశాలల్లో V తరగతి, 194 జూనియర్ కళాశాలలు (జనరల్ , వొకేషనల్), 10 సిఓఇ టిఎంఆర్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్, మైనారిటీల బ్యాక్‌లాగ్ ఖాళీల కోసం ప్రవేశాలు 2024- 25 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతుల్లో ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

5వ తరగతి లో మైనారిటీలకు – ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, నాన్-మైనారిటీల కోసం- లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, తరగతులు 6, 7, 8 లలో మైనారిటీల బ్యాక్‌లాగ్ ఖాళీ ల భర్తీకి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ విధానంలో ఎంపిక ఉంటుందన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ లలో ప్రవేశాలకు ఎస్‌ఎస్‌సి లేదా 10వ తరగతి 2024లో జిపిఎ ఆధారంగా, మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఇంటర్మీడియట్ (సిఓఈ టిఎంఆర్‌జెసి)లో స్క్రీనింగ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఫిబ్రవరి 6వ తేదీ లోగా లేదా రాష్ట్రంలోని ఏదైనా టిఎంఆర్ సంస్థ లేదా ఏదైనా ఇంటర్‌నెట్ కేంద్రం నుండి ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలని కోరారు. మరిన్ని వివరణల కోసం టెమ్రీస్ అధికారిక వెబ్‌సైట్ www.tmreistelangana.cag.gov.inని సందర్శించవచ్చన్నారు. లేదా రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌ల జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి లేదా ప్రిన్సిపాల్ లేదా హెల్ప్‌లైన్ నెం. 040- 23437909కు సంప్రదించవచ్చన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News