Saturday, April 27, 2024

మార్చి 29 నుంచి ఐపిఎల్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ 13వ సీజన్‌కు మార్చి 29న తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ రప్ చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపిల్ కొత్త సీజన్ ప్రారంభమవుతోంది. మే 24న జరిగే ఫైనల్‌తో ఐపిఎల్ ముగుస్తోంది. కాగా, లీగ్ మ్యాచ్‌లు మే 17న ముగుస్తాయి. ఇక, ఈ సీజన్‌లో శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు నిర్వహించారు. కేవలం ఆరు సార్లు మాత్రమే ఆదివారం రెండేసి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మిగతా రోజుల్లో కేవలం ఒక్క మ్యాచ్ చొప్పున మాత్రమే నిర్వహిస్తారు. ఇక, మ్యాచ్‌లు ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయనే దానిపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. త్వరలోనే దీనిపై తుది ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మాత్రం టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ గురించి మాత్రమే ప్రకటించారు.

IPL 2020 Starts from March

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News