Friday, May 17, 2024

రాణించిన డికాక్.. ముంబై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

IPL 2021: MI won by 7 wickets against RR

న్యూఢిల్లీ : ఐపిఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ముంబై 18.3 ఓవర్లలో కేవడం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్ క్వింటన్ డికాక్ అండగా నిలిచాడు. ఆరంభం నుంచే డికాక్ కుదురుగా ఆడాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ భారీ షాట్ల జోలికి వెళ్లకుండా రక్షణాత్మక ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇద్దరు సమన్వయంతో ఆడడంతో ముంబైకి మెరుగైన ఆరంభం లభించింది. కుదురుగా ఆడిన రోహిత్ ఒక సిక్స్‌తో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో డికాక్‌తో కలిసి 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ కూడా ధాటిగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సూర్యకుమార్ మూడు ఫోర్లతో 16 పరుగులు చేశాడు. అయితే ప్రమాదకరంగా కనిపిస్తున్న అతన్ని క్రిస్ మోరిస్ వెనక్కి పంపాడు.
డికాక్ అర్ధ శతకం..
మరోవైపు డికాక్ తన జోరును కొనసాగించాడు. అతనికి కృనాల్ పాండ్య అండగా నిలిచాడు. ఇద్దరు కలి సి స్కోరును ముందుకు నడిపించాడు. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన కృనా ల్ స్కోరును పరిగెత్తించాడు. రాజస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కీరన్ పోలార్డ్ 16 (నాటౌట్)తో కలిసి డికాక్ మరో వికెట్ కోల్పోకుండానే ముంబైకి విజయం సాధించి పెట్టాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన డికాక్ 50 బంతుల్లనే ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
రాణించిన బట్లర్, శాంసన్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ శుభారంభం అందించారు. ఇద్దరు ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఇటు బట్లర్, అటు యశస్వి జోరును ప్రదర్శించడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ మూడు సిక్స్‌లు, మరో 3 ఫోర్లతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే సమయంలో యశస్వితో కలిసి తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన సంజు శాంసన్ కూడా దూకుడుగా ఆడాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 32 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన శాంసన్ ఐదు ఫోర్లతో 42 పరుగులు సాధించాడు. శివమ్ దూబే రెండు సిక్సర్లు, మరో 2 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ స్కోరు 171 పరుగులకు చేరింది.

IPL 2021: MI won by 7 wickets against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News