Monday, April 29, 2024

గూగుల్ సెర్చ్‌లో ఐపిఎల్ టాప్ ట్రెండింగ్

- Advertisement -
- Advertisement -

IPL top trending in Google search

న్యూఢిల్లీ: ఓవైపు కరోనా గురించిన వార్తలకు మీడియాలో అధిక ప్రాధాన్యత ఇచ్చినా, ఐపిఎల్ 13వ ఎడిషన్‌ను ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా శోధించినట్టు గూగుల్ ఇండియా ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2020’ వెల్లడించింది. గతేడాది ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్‌కు గూగుల్ సెర్చ్‌లో మొదటిస్థానం దక్కింది. ఈ ఏడాది ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబర్ 19నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించారు. 12వ ఎడిషన్‌కన్నా 13వ ఎడిషన్‌కు వీక్షకుల సంఖ్య 28 శాతం పెరగడం గమనార్హం. టాప్ ట్రెండింగ్ 10 వార్తల్లో ఐపిఎల్ తర్వాత అమెరికా ఎన్నికలు,పిఎం కిసాన్ స్కీం, బీహార్ ఎన్నికలు,ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తీర్పు, లాక్‌డౌన్, ఇండియాచైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన, రామ్‌మందిర్ నిర్మాణంలాటి అంశాలను భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా శోధించారు. వ్యక్తులకు సంబంధించి టాప్ ట్రెండింగ్‌లో వరుసగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్, జర్నలిస్ట్ ఆర్నాబ్‌గోస్వామి, దక్షిణ కొరియా అధినేత కిమ్‌జోంగ్‌ఉన్, బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్, కంగనారనౌత్, రియాచక్రవర్తి, అంకితాలోఖండే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News