Sunday, April 28, 2024

అందరినీ థ్రిల్ చేసే సినిమా

- Advertisement -
- Advertisement -

Ishq Movie to Release on July 30

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన నటుడు తేజ సజ్జ హీరోగా ‘జాంబి రెడ్డి’తో సోలో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ యంగ్ హీరో చేసిన ‘ఇష్క్’ ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జా మీడియాతో మాట్లాడుతూ “తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత ఈనెల 30న థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా మా ‘ఇష్క్’. రెగ్యులర్ సినిమా కథలకు దూరంగా కొత్త కాన్సెప్ట్ తో కొత్త కంటెంట్ తో వస్తోన్న సినిమా ఇది. మొదటి సీన్ నుండి లాస్ట్ సీన్ వరకూ ఆసక్తికరంగా ఈ సినిమా కొనసాగుతుంది. న్యూ స్టైల్ ఆఫ్ మేకింగ్, న్యూ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా అందరినీ థ్రిల్ చేస్తుంది ఈ సినిమా. తెలుగు సినిమాకి ఇది కొత్తరకం కంటెంట్. హీరో క్యారెక్టర్ మీద, అతని సీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే సినిమా ఇది. అంటే నా నటన మీద నడిచే సినిమా ఇది. నాకు ఓ బేబీ, జాంబీరెడ్డి సినిమాల్లో మంచి పేరు వచ్చింది. కానీ ఈ సినిమాతో నా గురించి అందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటారని అనుకుంటున్నాను. ఇక ప్రస్తుతం చేస్తున్న ‘హను-మాన్’ తర్వాత నా కెరీర్ స్థాయి మారుతుందనే ఆశతో ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదు” అని అన్నారు.

Ishq Movie to Release on July 30

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News